అక్కినేని అఖిల్( Akhil Akkineni ) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు.
అఖిల్, పూజా హెగ్డే జోడీ గురించి నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపించాయి.సుమ అడ్డా ప్రోగ్రామ్( Suma Adda ) కు అఖిల్, సాక్షి వైద్య హాజరు కాగా ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
మే నెల 6వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.సుమ మాట్లాడుతూ సిసింద్రీ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అఖిల్ మన షోకు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మీరు ఈయనకు ఏమవుతారండి అని సుమ సాక్షి వైద్యను అడగగా అఖిల్ లవ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న అమ్మాయిని నేనని ఆమె తెలిపారు.ఆ తర్వాత అఖిల్ సాక్షి మేడమ్ సారీ అండీ అంటూ వెరైటీ ఎక్స్ ప్రెషన్లను ఇచ్చారు.
సుమ షోలో భాగంగా క్రమశిక్షణ వల్ల చీమలు ఒకే లైన్ లో నడుస్తాయి అని చెప్పగా అఖిల్ అవునని చెప్పారు.సుమ వెంటనే ఒక లైన్ అనే మీనింగ్ చీమలకు లేదని మనం ఇచ్చిన మీనింగ్ కాబట్టి మనం అనుకుంటున్నాం అని అఖిల్ చెప్పగా ఈ విషయం చీమలు మీకు చెప్పాయా అని అఖిల్ సుమకు రివర్స్ లో కౌంటర్ వేశారు.మరో ప్రశ్నకు అఖిల్ అవునని చెప్పగా ఎలా చెప్పావని సుమ అడిగితే మీ ఫేస్ చూసి చెప్పానంటూ అఖిల్ మళ్లీ సుమపై కౌంటర్ వేశారు.
ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ ఇచ్చి సుమకు అఖిల్ ప్రపోజ్ చేశారు.పోకిరి సినిమాలోని పండుగాడు డైలాగ్ చెప్పి అఖిల్ వావ్ అనిపించారు.నాకు బాగా ఇష్టమైన హీరో రామ్ చరణ్ అని చరణ్ నా హార్ట్ బీట్ అని అఖిల్ చెప్పుకొచ్చారు.
డేట్ కు వెళ్లాల్సి వస్తే పూజా హెగ్డేతో( Pooja Hegde ) వెళతానని అఖిల్ కామెంట్లు చేశారు.