గత కొంతకాలం నుండి పూజ హెగ్డే కు అస్సలు కలిసి రావటం లేదు.ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆమెకు మాత్రం దరిద్రం వెంటాడుతుందని చెప్పాలి.
మంచి మంచి స్టార్ హీరోల సినిమాలలో పాన్ ఇండియా లెవెల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా అమ్మడు సరైన సక్సెస్ కొట్టలేకపోతుంది.ఒక్క సినిమా అంటే ఏదో అనుకోవచ్చు కానీ.
వరుసగా ఐదారు సినిమాలు ప్లాఫ్ అయ్యాయి అంటే ఈ అమ్మడికి నిజంగానే దరిద్రం వెంటాడుతుంది అని అందరూ అనుకుంటున్నారు.

నిజానికి కెరీర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకుంది పూజ హెగ్డే( Pooja Hegde ).వరుసగా సక్సెస్ లు అందుకున్నంత కాలం ఈ ముద్దుగుమ్మ చాలామంది దర్శక నిర్మాతలకు సెంటిమెంట్ గా మారింది.ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ప్లాఫ్ అయిన సినిమాలలో కూడా అవకాశాలు ఇచ్చారు దర్శకనిర్మాతలు.
కానీ ఈసారి పూజకు దరిద్రం నెత్తి మీదనే కూర్చున్నట్లు కనిపిస్తుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాకు చేరుకున్న పూజకు ఇలా జరగటంతో తన అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
ఎవరైతే సెంటిమెంట్ గా భావించారో ఇప్పుడు వాళ్లే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తున్నారు.వరుస సినిమాలతో సక్సెస్ కాకపోయేసరికి ఇతర దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడి దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు.
ముందుగానే కమిట్మెంట్ తీసుకున్న సినిమాలలో కూడా ఈమెను పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్( Bollywood, Kollywood )లో కూడా అవకాశాలు అందుకుంది.కానీ అక్కడ కూడా పూజ హెగ్డే కు దరిద్రం వెంటాడిందని చెప్పాలి.అయితే ఈ అమ్మడికి దరిద్రం ఎప్పటినుంచి వెంటాడిందంటే.
తెలుగులో అప్పటివరకు ఒక మోతాదులో సక్సెస్ లతో దూసుకుపోయిన ముద్దుగుమ్మ అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేస్తుంది.ఇక ఈ సినిమాతో పూజ హెగ్డే సక్సెస్ చూసి తొందరపడి దర్శక నిర్మాతలు మంచి మంచి సినిమాలలో అవకాశాలు ఇచ్చారు.
అందులో సర్కస్, రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో బాగానే అవకాశాలు వచ్చాయి.ఇక వరుసగా ఈ ముద్దుగుమ్మ బిజీ అవ్వడంతో ఇక అదృష్టం వెంటే ఉందని చాలామంది అనుకున్నారు.

కానీ ఎప్పుడైతే ఈ సినిమాలు విడుదల అయ్యాయో ఇక అంతే సంగతి.ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది.అదే సమయంలో బాలీవుడ్ లో ఒక సినిమాలో కూడా చేయగా అది కూడా పూర్తిగా డిజాస్టర్ అయ్యింది.దీంతో అప్పుడే ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అని ముద్ర పడింది.
అయినప్పటికీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్( Salman Khan ) సరసన మరో సినిమాలో అవకాశం అందుకోగా ఆ సినిమా కూడా రీసెంట్ గా విడుదలై ప్లాఫ్ అయ్యింది.అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి.
అవి కూడా పెద్దపెద్ద సినిమాలే.టాలీవుడ్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్( Mahesh Babu , Pawan Kalyan ) సినిమాలలో అవకాశాలు అందుకోగా.
బాలీవుడ్ లో కూడా మరో ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలిసింది.ఈ మూడు సినిమాలలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమెను తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం వరుస ప్లాఫ్లే.ఒకవేళ ఆ రెండు సినిమాలు కూడా ప్లాఫ్ అయ్యాయో ఇక పూజ హెగ్డే పెట్ట సర్దుకోవడమే అని అంటున్నారు జనాలు.
చూడాలి మరి ఈ రెండు సినిమాలు కూడా ఎటువంటి సక్సెస్ అందిస్తాయో.







