హీరోయిన్స్( Heroines ) తెర పైన నటిస్తూ కన్నీళ్లే పెట్టిస్తే చూడటానికి చాల బాగుటుంది కానీ చిన్న చిన్న కారణాలతో లైఫ్ ని ఆత్మహత్య తో ముగించి అందరిని కన్నీళ్లు పెట్టించడం మాత్రం చాల పెద్ద తప్పు.ఆలా కొంత మంది అర్దాంతరంగా తమ జీవితాలని ముగిస్తూ ప్రతి ఒక్కరిని శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు.
మరి ఆలా చిన్న కారణకతో పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ వారి చావుకు గల కారణాలను సూసైడ్ నోట్స్ గా( Suicide Notes ) రాసి తనువు చాలిస్తున్నారు.ఆలా వారి చివరి అక్షరాలతో ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నారు.
భరించలేని ఆ బాధను ఎలా మోసారో చెప్తూ రాసిన ఉత్తరాలు చాల వైరల్ అయ్యాయి.ఆలా వైరల్ అయినా ఉత్తరాల గురించి తెలుసుకుందాం.
సిల్క్ స్మిత

ఐటెం గర్ల్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి, అపరిచితుడితో ప్రేమలో పడి సినిమా నిర్మాణం లోకి దిగి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఆస్థి మొత్తం కోల్పోయి అప్పుల పాలై ఎలాంటి దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక కారణమైన నిర్ణయం తీసుకుంది.ఆమె చనిపోతూ బాధను వెల్లడించిన విధానం చూసి యావత్ తెలుగు ప్రపంచం కన్నీళ్లు పెట్టింది.మన అభిమాన నాట్యగత్తె ఇంత బాధను ఎలా భరించింది అంటూ ఆవేదన చెందారు.ఆమె రాసిన సూసైడ్ నోట్ ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.
జియా ఖాన్

సిల్క్ స్మిత( Silk Smitha ) తర్వాత అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయినా సూసైడ్ నోట్ జియా ఖాన్( Jia Khan ) రాసిన లేఖ.ఆమె ప్రేమలో పడి మోసపోయి గర్భం కూడా దాల్చి, ఆ బిడ్డను కూడా కోల్పోయి చివరికి జీవితం కూడా కోల్పోయి ఒంటరి తనం భరించలేక ఆత్మహత్య చేసుకొని కన్ను మూసింది.ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న జియా మరణం బాలీవుడ్ ని కుదిపేసింది.ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి చేతుల్లో మోసపోయిన విధానం లేఖలో స్ప్రష్టం గా రాసింది.
ఇక ఇద్దరు నటీమణుల్లో చెప్పాల్సిన మరొక విషయం ఇద్దరు ప్రేమ అనే ఒక విషయంలో మోసపోయి ఉరి పోసుకొని కన్నుమూసారు.







