మెగా వారి మేనల్లుడు సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు.మెగా సపోర్టుతో ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటికీ కూడా తన టాలెంట్ తో హీరోగా ఒక పేరు సంపాదించుకున్నాడు.
చాలా వరకు మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
దీంతో సాయి ధరంతేజ్ స్టార్ హోదాకు చేరుకున్నాడని తెలుస్తుంది.
డైరెక్టర్ కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాడు.
ఇక ఈ సినిమాను నిర్మాత దిల్ రాజ్ నైజాం, వైజాగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయగా ఆయన కూడా చాలా సంతోషంగా ఉన్నాడు.అయితే ఈ సినిమా సక్సెస్ థాంక్యూ మీట్స్( Thank you Meats ) సందర్భంగా ఈవెంట్ ను ఏర్పాటు చేయగా ఆ ఈవెంట్లో దిల్ రాజు( Dil raju ) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

సీడెడ్ డిస్ట్రిబ్యూటర్( Seeded distributor ) ఎవరో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేశాడని విన్నాను.ఆయన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కొనేశాడు అని తెలుసుకున్నాను.అంటే ఈ సినిమా మీద ఎంత ఫ్యాషన్, జడ్జిమెంట్ ఉందో అర్థమైంది అని అన్నాడు.ఇక తను కూడా కెరీర్ ప్రారంభంలో అలాగే ఉన్నాను అంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఇక ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని తను అనుకోలేదంటూ.ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ కార్తీక్ కే ఇస్తానని అన్నాడు.అంతేకాకుండా మొదటిసారి డైరెక్టర్ గా ఈ సినిమాను ఇంతవరకు తీసుకురావడానికి.ఎన్ని కష్టాలు పడ్డాడో.ఎంతమందిని ఎలా హింసించి ఉంటాడో తెలుసు అంటూ.కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా టీమ్ అంతా సపోర్ట్ చేసి ఉంటుంది.
సినిమా బాగా తీయగలిగాడు అంటూ ప్రశంసించాడు.ఇక హీరో సాయి ధరమ్ తేజ్ ను మై హీరో అని అంటే తనను తిడతాడని.
మై బాయ్ అనమంటాడని వాళ్ల మధ్య ఉన్న సీక్రెట్ విషయాన్ని బయట పెట్టాడు.ఇక ఇప్పటికే తాము కలిసి మూడు సినిమాలు తీశామంటూ.
ఇక మళ్లీ కలిసి చేస్తే దాన్ని మించేలా చేయాల్సి ఉంటుందని అన్నాడు.







