వైరల్: డ్రైవింగ్ చేస్తూ తలకిందులుగా చిన్నోడు.. నెటిజన్లు నవ్వులే నవ్వులు!

స్మార్ట్ ఫోన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతోంది.అసలు ఇప్పుడూ సోషల్ మీడియా( Social Media ) అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో జనాలు లేరనే చెప్పుకోవాలి.

 Toddler Funny Road Accident While Playing With Toy Car Video Viral Details, Driv-TeluguStop.com

ఇక ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే నెట్టింట షేర్ చేసి పడేస్తున్నారు కొంతమంది ఔత్సాహికులు.దాంతో అవలీలగానే కొన్ని వీడియోలు నెటిజన్ల కంట పడగానే వైలర్ అయిపోతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్‌ని చూసి నెటిజన్లు అయితే కడుపుబ్బా నవ్వేసుకుంటున్నారు.అక్కడితో ఆగకుండా ఆ పిల్లడు వేసి ఫీట్ చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోని ఒకసారి గమనించినట్లయితే ఓ చిన్న పిల్లవాడు తన బొమ్మ కారుతో( Toy Car ) నేలపై ఆడుకుంటూ ఉంటాడు.

అలా ఆడుకుంటూ దాన్ని స్పీడ్‌గా నేలపై నడుపుతూ ఉండగా, ఎదురు ఒక రాయి దానికి అడ్డు పడడంతో ఆ కార్‌ అక్కడ ఇరుక్కుపోతుంది.దాంతో ఆ పిల్లవాడు ఒక్కసారిగా శీర్షాసనం కోసం లేచినట్లుగా ముందుకు పడతాడు.

ఇక ఇందుకు సంబంధించన దృశ్యాలను తన కెమెరాలో బంధించిన వ్యక్తి నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

స్మైల్స్౪మెయిల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియో అనతికాలంలోనే వైరల్ కావడం విశేషం.కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు “డ్రైవింగ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం.తగ్గేదేలే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు “కార్‌కి ఇన్స్యూరెన్స్ ఉందా?” అంటూ కామెంట్ చేస్తున్నారు.కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 2 వేల లైకులు, 50 లక్షల వీక్షణలు రావడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube