తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మేరకు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ తో పాటు నిజామాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడే సూచన ఉందని పేర్కొంది.అదేవిధంగా భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట్ తో పాటు గద్వాల జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.







