మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి ఎంత చెప్పినా తక్కువే తన అందం అభినయం నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఐశ్వర్యారాయ్ తాజాగా మణిరత్నం ( Maniratnam)దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selven 2) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఐశ్వర్య నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి.
ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాపై నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా అభిషేకం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్రబృందం కృషి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.ఐశ్వర్యను చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.అందుకే మీరు ఆరాధ్యని చూసుకుంటూ తనని సినిమాలు చేయనివ్వండి అంటూ అభిషేక్ బచ్చన్ కు సలహా ఇచ్చారు.
ఇక ఈ విషయంపై స్పందించిన అభిషేక్ సమాధానం చెబుతూ.నేనేమైనా వద్దన్నానా! సర్ తను ఏది చేయాలనుకున్న నా అనుమతి అవసరం లేదు.అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను అని రిప్లై ఇచ్చారు.

ఇలా అభిషేక్ బచ్చన్ నేటిజన్ చేసిన కామెంట్ కి రిప్లై ఇస్తూ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నేటిజన్ చాలా బాగా చెప్పారు సార్ అలాగే మీరు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ తన మనసులో మాటను కూడా బయటపెట్టారు.ఇలా నేటిజన్ అభిషేక్ మధ్య జరిగినటువంటి ఈ కాన్వర్జేషన్ కు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తనకు ఐశ్వర్య ఆరాధ్య అంటే ఎంతో ఇష్టమనీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడంతో గతంలో వీరి గురించి వచ్చిన విడాకుల వార్తలకు కూడా చెక్ పెట్టినట్లు అయింది.







