అల్లరి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు నరేష్( Naresh ).ఈ సినిమా ద్వారా అల్లరి సినిమా పేరు తన పేరు ముందు చేరడంతో అల్లరి నరేష్ ( Allari Naresh )గా మారిపోయారు.
ఇలా నరేష్ ఇప్పటివరకు ఎన్నో కామెడీ సినిమాలలో హీరోగా నటించి మెప్పించారు.అయితే ఈ మధ్యకాలంలో నరేష్ ఎంపిక చేసుకుని సినిమాలన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయి.
కామెడీ తరహా పాత్రలు కాకుండా చాలా సీరియస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నరేష్ నటించిన చిత్రం ఉగ్రం( Ugram ).
ఈ సినిమా మే ఐదవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు నరేష్ తాజాగా రాజమండ్రిలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ ఉగ్రం సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఇందులో తాను సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని తెలియజేశారు.అయితే ఇదివరకు తాను పలు సినిమాలలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినప్పటికీ అవి చాలా కామెడీగా ఉంటాయని కానీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్( Polcie Officer Role ) పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలిపారు.

ఇక తాను నటించిన మొదటి చిత్రం అల్లరి.ఈ సినిమా 2002 మే 10వ తేదీ విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఉగ్రం సినిమా తనకు 60వ సినిమా.ఇలా సినిమాలో పరంగా చూసుకుంటే ఇది నాకు షష్టిపూర్తి అంటూ నరేష్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రం కామెడీ నేపథ్యంలోనే ఉంటుందని నరేష్ తెలియజేశారు.ఇక తనకు ఎప్పటినుంచో ఇంగ్లీష్ కామెడీ పాత్రలలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఈ సినిమా ద్వారా నరేష్ కుమార్తె ఊహ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.మరి ఈ సినిమా నరేష్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.







