తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేశారు.
అనంతరం నూతన సచివాలయంలో పూజలు నిర్వహించారు.శిలాఫలకం ఆవిష్కరించిన తరువాత ఆరో అంతస్తుకు వెళ్లిన ఆయన తన ఛాంబర్ లో ఫైల్ పై సంతకం చేశారు.
అదే సమయంలో మంత్రులు కూడా తమకు కేటాయించిన ఛాంబర్లలో ఆశీనులై సంతకాలు చేశారు.







