తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ ( Director Teja )తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.సినిమాల గురించి సినిమాలకు తగ్గుతున్న ఆదరణ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు సినిమాలు విడుదలయితే పెద్ద ఎత్తున థియేటర్ కి ప్రేక్షకులు వచ్చి సినిమాలను చూసేవారు.అయితే కరోనా వచ్చిన తరువాత థియేటర్ కి ఆదరణ తగ్గిపోయిందని అందుకు కారణం ఓటీటీలకు ఆదరణ పెరగడమే కారణమని పలువురు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై తేజ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఒకానొక సమయంలో వీధి నాటకాలు వేస్తే చూసేవారు అయితే థియేటర్లు వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది.అలాగే టీవీలు వచ్చాయి.టీవీలు వచ్చిన తర్వాత కూడా థియేటర్లకు ఆదరణ తగ్గలేదు.
అలాగే ప్రస్తుతం యూట్యూబ్, ఓటీటీ( OTT )అందుబాటులోకి వచ్చిన థియేటర్లకు ఆదరణ తగ్గలేదని ఈయన తెలియజేశారు.పెద్ద స్క్రీన్ పై సినిమా చూస్తే అనుభూతి కలుగుతుందని అయితే ప్రేక్షకులు ఆ అనుభూతిని ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నారని తెలిపారు.
ప్రతివారం తాను సింగిల్ స్క్రీన్ థియేటర్( Single Screen Theater ) కి వెళ్లి సినిమా చూస్తానని తెలియజేశారు.

ఇక మల్టీప్లెక్స్ లో అధికంగా స్క్రీన్ లు ఉంటాయి.కనుక తనకు సినిమా చూసిన ఫీలింగ్ కలగదని తెలిపారు.ఇక మల్టీప్లెక్స్ థియేటర్ల గురించి మాట్లాడుతూ ఇక్కడ మనం సినిమా టికెట్ ( Movie Ticket ) కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు కన్నా తినడానికి తీసుకునే పాప్ కార్న్ ( Popcorn ) ఖర్చు అధికంగా ఉంటుందని తేజ వెల్లడించారు.
ఈ పాప్ కార్న్ ఖర్చు భరించలేక చాలామంది మల్టీప్లెక్స్ థియేటర్లకు రావడంలేదని, ఈ సందర్భంగా తేజ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







