విశాఖ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు.ఈ వ్యవహారంలో మొత్తం ఇద్దరు డాక్టర్లతో పాటు దళారీలను అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.ఈ మేరకు మధ్యాహ్నం కేసు వివరాలను విశాఖ సీపీ వెల్లడించనున్నారు.
అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ కొనసాగింది.కాగా పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించి ఆస్పత్రిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
డబ్బు ఆశ చూపి గతేడాది డిసెంబర్ లో వినయ్ కుమార్ నుంచి కిడ్నీ తీసుకున్నారు.ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.







