ఎన్టీఆర్ శత జయంతి వేడుకల ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబును పొగడటం విడ్డూరంగా ఉందని తెలిపారు.
సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుందని పేర్కొన్నారు.అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న గుర్తుకు రాదన్నారు.ఎన్టీఆర్ చావుకు చంద్రబాబు కారణమని ఆరోపించారు.20 ఏళ్ల పాటు చంద్రబాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తించాలని తెలిపారు.







