ఆ సినిమాకు ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయాను... రాశిఖన్నా కామెంట్స్ వైరల్!

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా( Rashi Khanna ) .ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 I Ran Away Without Giving An Audition For That Movie Raashi Khannas Comments Are-TeluguStop.com

అయితే ఈమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రాశి ఖన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాశిఖన్నా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈమె ఊహలు గుసగుసలాడే సినిమా కంటే ముందుగా పలు సినిమాలకు ఆడిషన్స్ ( Auditions ) ఇచ్చారని తెలియజేశారు.ఈ క్రమంలోనే మద్రాస్ కేఫ్ ( Madras Cafe ) అనే సినిమా కోసం తాను ఆడిషన్ కి వెళ్ళినట్లు తెలియజేశారు.ఈ సినిమా ఆడిషన్ కోసం వెళ్లగా అక్కడ చాలామంది ఉండడంతో అందరి మధ్య తనకు ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక పారిపోయానని తెలియజేశారు.

ఇలా సినిమా ఆడిషన్ కి వెళ్లి ఆడిషన్ ఇవ్వకుండా భయంతో పారిపోయాను.అయితే ఆర్ట్ పై తనకు గౌరవం ఉండడం చేత తిరిగి ఆడిషన్ ఇచ్చాను అంటూ రాశిఖన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ సినిమాకి ఆడిషన్ ఇవ్వడంతో ఈ సినిమాలో తాను సెలెక్ట్ అయ్యాననీ తెలియజేశారు.ఇక తెలుగులో ఈమె చివరిసారిగా నాగచైతన్య ( Nagachaitanya ) హీరోగా నటించిన థాంక్యూ( Thank You ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube