ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది.ఈ క్రమంలో వచ్చే నెల 4వ తేదీన పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
పార్టీ కార్యాలయ నిర్మాణానికి సుమారు 20 నెలల సమయం పట్టింది.సెప్టెంబర్ 2, 2021న బీఆర్ఎస్ భవన్ కు కేసీఆర్ భూమి పూజ చేశారు.
సుమారు రెండు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారు.కాగా పార్టీ ఆఫీస్ ముందు కారు గుర్తును ఏర్పాటు చేశారు.
సమాజ్ వాదీ, జేడీయూ కార్యాలయాల మధ్యలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మితమైంది.







