సూర్యాపేట జిల్లా:కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్మిక రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మ భిక్షం భవనంలో జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినతెలంగాణ సివిల్ సప్లై హమాలి యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడులుగా విభజన చేస్తూ కార్మికులకు పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు.పెట్టుబడిదారులకు కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీసం పని భద్రత కల్పించలేని పరిస్థితి ఈ పాలకులు ఉన్నారని మండిపడ్డారు.కార్మిక రంగ సమస్యలను ప్రతిభింభించే విధంగా కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తున్న పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉజ్జని రత్నాకర్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, నియోజకవర్గ గౌర అధ్యక్షులు చామల అశోక్ కుమార్,సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి బి.శ్యాంసుందర్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.రాజారాం,నియోజవర్గ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,కోశాధికారి గాలి కృష్ణ,గౌరీ నాయుడు శ్రీనివాస్,పి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.







