అల్లూరి జిల్లాలో ఫైనాన్షియర్ విజయ్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా విజయ్ ను హత్య చేసినట్లు గుర్తించారు.
విజయ్ భార్య ప్రీతి, తండ్రి శంకర్ రావుతో పాటు మరికొందరి సాయంతో హత్య చేసినట్లు పాడేరు పోలీసులు గుర్తించారు.హత్య చేసిన అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించారు.
ఈ క్రమంలో నిందితులు ప్రీతి, శంకర్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అయితే భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చెలరేగిన గొడవల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.







