రష్యా – ఉక్రెయిన్ యుద్ధం( Russia Ukraine War ) నేపథ్యంలో రష్యా నుండి నాటో దేశాలు దూరం జరిగినప్పటికీ ఇండియా తటస్థ వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నాయి ఆయా దేశాలు.ఓ రకంగా చెప్పుకోవాలంటే కడుపుమంటతో చచ్చిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో అమెరికా యూరప్ దేశాలు ఎంత ఒత్తిడిని తీసుకొచ్చినా రష్యా నుండి ఇండియా భారీ ఎత్తున ఆయిల్ ని కొనుగోలు చేస్తుంది.ఇదివరకు ఇరాక్ నుంచి అత్యధికంగా కొనుగోలు చేసిన ఇండియా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చమురిని రష్యా నుండి కొనుగోలు చేయడం వాటికి మింగుడు పడడం లేదు.

అదంతా ఒకెత్తయితే రాబోయే రోజుల్లో పుతిన్( Putin ) జి-25కి ఇండియాకి రాబోతుండడం ఇపుడు హాట్ టాపిక్ అయింది.దీని ఇంపాక్ట్ తో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అవును, భారతీయ పారిశ్రామికవేత్తలు మాస్కో ప్రాంతంలో కొత్త బిజినెస్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కాగా 10కంటే ఎక్కువ భారతీయ కంపెనీలు పారిశ్రామిక మాస్కో ప్రాంతంలో ఈపాటికే విజయవంతంగా పని చేయడం ఆరంభించాయి.
ఈ తరుణంలో కొత్త ప్రాజెక్టులు కూడా షురూ చేయనున్నారు.

పెట్టుబడులు రష్యా నుండి భారత్ కి రావడం లేదు కానీ, భారత నుండి పెట్టుబడులు రష్యాకు ( Russia ) వెళ్తున్నాయి.ఇవే ఇప్పుడు అంతర్జాతీయ లెక్కలుగా మారుతున్నాయి.రష్యా కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పేస్తోంది.
ఇకపోతే మార్కెట్ ఎక్కడున్నా అందుకనే తత్వం భారతీయులది.రష్యా భారతదేశానికి సబ్సిడీ ధరలకు డీజిల్ గ్యాస్ పెట్రోల్ బగ్గు అందిస్తుంది.
ఇదే తరుణంలో భారతదేశం నుండే రష్యాకి వ్యాపార పెట్టుబడులు వెళుతున్నాయి.దాంతో ఇరుదేశాలు బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాయని నాటో దేశాలు కుళ్లిపోతున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి.







