ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగాలపై ప్రస్తుతం యూకే పోలీసులు( UK Police ) కస్టడీలో వున్న భారత సంతతి వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను అక్కడి కోర్ట్ తోసిపుచ్చింది.ప్రస్తుతం అతనిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది.
ఈ కేసును స్కాట్లాండ్ యార్డ్ లండన్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.భారత్‌లోని తమిళనాడు రాష్ట్రం మధురైలో జన్మించిన సుందర్ నాగరాజన్ (65)( Sundar Nagarajan ) మంగళవారం వీడియో లింక్ ద్వారా వెస్ట్‌మనిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో( Westminster Magistrates’ Court ) విచారణకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా తనపై నమోదు చేసిన మోసం, మనీలాండరింగ్ ఆరోపణలను అతను తిరస్కరించాడు.మరోవైపు నాగరాజన్ హిందూ నేపథ్యానికి చెందినవాడని.
ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్ధతు ఇవ్వలేదని జిల్లా జడ్జి బ్రియోనీ క్లార్క్ అన్నారు.అయినప్పటికీ అతని బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు.
అలాగే మే 23న అదే కోర్టులో వీడియో లింక్ ద్వారా మరోసారి హాజరుకావాలని ఆదేశించారు.

కాగా.నాగరాజన్‌ను మెట్ పోలీస్ అనుబంధ నేషనల్ ఎక్స్‌ట్రాడిషన్ యూనిట్ ఏప్రిల్ 18న పశ్చిమ లండన్‌లోని హేస్ వద్ద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.పోలీసులు అతనిని అరెస్ట్ చేయడానికి, అతని వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి నాగరాజన్ ఇంటిపై దాడి చేసినట్లు కోర్టుకు విన్నవించారు.
అటు యూఎస్ అధికారుల తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్( Crown Prosecution Service ) (సీపీఎస్) వాదనలు వినిపించింది.నాగరాజన్‌కు.లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాతో ఆర్ధిక వ్యవహారాలు ముడిపడి వున్నాయని న్యాయవాదులు వాదించారు.ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడే అనుమానంతో వేల్స్‌లో 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మెట్రోపాలిటిన్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం కమాండ్ నాగరాజన్‌పైనా యాక్షన్‌లోకి దిగింది.

తీవ్రవాదులకు ఫైనాన్సింగ్ చేస్తున్న వారిపై యూకే, యూఎస్( UK, US ) సమన్వయ చర్యల్లో భాగంగా మెట్ పోలీస్ అనుబంధ కౌంటర్ టెర్రరిజం కమాండ్ అధికారులు నజీమ్ అహ్మద్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.తీవ్రవాద సంస్థ హిజ్బుల్లాకు నిధులు సమకూర్చేందుకు గాను నజీమ్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డాడు.ఈ క్రమంలో అతని కంపెనీలకు ఇంటర్నేషనల్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగరాజన్ సాయం చేసినట్లుగా అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.నజీమ్ అహ్మద్( Nazim Ahmed ) ఒక ఆర్ట్ కలెక్టర్, డైమండ్ డీలర్‌తో కూడా సంబంధాలు కలిగి వున్నాడని.
హిజ్బుల్లాకు నిధుల వనరుగా మారాడాని అమెరికా ఆరోపిస్తున్నట్లు మెట్ పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో యూకే, యూఎస్‌లు నజీమ్ అహ్మద్, అతని సహచరులకు వ్యతిరేకంగా ఆంక్షలు ప్రకటించాయి.







