విరూపాక్ష తర్వాత చాలా మంది నిర్మాతలు ఫోన్ చేశారు... కార్తీక్ దండు కామెంట్స్ వైరల్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Saidharam Tej ) తాజాగా విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కార్తీక్ దండు ( Karthik Dandu ) అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Karthik Dandu Comments About Tollywood Producers , Saidharam Tej , Virupaksha Mo-TeluguStop.com

ఇలా ఈ సినిమా మంచి ప్రేక్షకు ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ కార్తీక్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పలు విషయాలను వెల్లడిస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.ఈ సినిమా కరోనా కంటే ముందుగానే డిస్కషన్ జరిగి సినిమా అంతా ఓకే అనుకున్న సమయంలోనే లాక్ డౌన్ పడింది.ఇలా లాక్ డౌన్ పడటంతో ప్రొడ్యూసర్లు హీరో మొత్తం ప్రపంచాన్ని అష్టదిగ్బంధనం చేసేశారు అంటూ సరదాగా తనపై కామెంట్లు చేశారని తెలిపారు.కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా ప్రారంభించాలనుకున్న సమయంలో హీరో ప్రమాదానికి గురికావడం నన్ను అయోమయ పరిస్థితులలోకి నెట్టేసిందని తెలిపారు.

ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి బయటపడ్డారని తాను కోలుకుంటున్నారని తెలియగానే తనకు ప్రాణం తిరిగి వచ్చినట్లు అయిందని కార్తీక్ వెల్లడించారు.ఇలా ఈ కారణాల వల్లే సినిమా ఆలస్యమైందని ఆలస్యమైన చాలా మంచి విజయాన్ని అందుకున్నామని తెలిపారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది దర్శక నిర్మాతలు తనకు ఫోన్లు చేసి ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు.ఇక దిల్ రాజు ( Dil Raju )గారు కూడా తనకు ఫోన్ చేసి అభినందించారని తెలిపారు.

ఇలా చాలామంది నిర్మాతలు తనకు ఫోన్లు చేసిన తాను ఎవరి నుంచి ఇంకా తదుపరి సినిమాకు అడ్వాన్స్ తీసుకోలేదని కార్తీక్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube