టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత(Samantha) గురించి గతంలో నిర్మాత చిట్టిబాబు(Chitti Babu) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఆమె సింపతి కార్డు ప్లే చేస్తుందని ఆమె మొహం ముసలి దానిలా ఉందని తాను హీరోయిన్గా పనికిరాదు అంటూ పెద్ద ఎత్తున చిట్టిబాబు కామెంట్లు చేశారు.
ఇకపై సమంత హీరోయిన్ గా పనికిరాదని అసలు ఆమెకు శాకుంతలం సినిమాలో( Shaakuntalam ) ఎలా అవకాశం ఇచ్చారో తనకు అర్థం కాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా చిట్టిబాబు చేసిన ఈ కామెంట్లకు సమంత తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

సమంత చిట్టిబాబు పేరు ప్రస్తావించకుండా చెవులలో వెంట్రుకలు ఎందుకు వస్తాయని గూగుల్ సెర్చ్ చేశానంటూ ఒక పోస్ట్ చేస్తూ నిర్మాతకు కౌంటర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను సమంత గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తనకు తెలియదు అంటూ కామెంట్ లు చేశారు.ఇక ఆమె ఎక్కడ నా పేరు ప్రస్తావించలేదు కాబట్టి నేను కూడా సమంత అని చెప్పడం లేదు అంటూ ఈయన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

సమంతకు నేను కౌంటర్ ఇస్తే తిరిగి తను రిప్లై కూడా ఇవ్వలేదని ఆమె నా చెవులో వెంట్రుకల గురించి మాట్లాడటం మానేసి నేను చేసిన వ్యాఖ్యలలో ఉన్న నిజాయితీ గుర్తించి మాట్లాడితే బాగుంటుందంటూ మరోసారి చిట్టి బాబు సమంత పై మండిపడ్డారు.ఇలా గత కొద్దిరోజులుగా సమంత, చిట్టిబాబు మధ్య మొదలైనటువంటి ఈ గొడవ అలాగే కొనసాగుతోంది.ఇక చిట్టిబాబు సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.







