బిగ్ బాస్ తో సూపర్ పాపులర్ అయిన దివి వాద్య( Divi Vadthya ) తనకు వచ్చిన ఈ పాపులారిటీని సరిగా వాడేసుకుంటుంది.మామూలుగా అయితే బిగ్ బాస్ తర్వాత వరుస అవకాశాలు అందుకుని క్రేజ్ తెచ్చుకుంటారు కానీ అమ్మడు కేవలం సోషల్ మీడియాతో హడావిడి చేస్తూ అదరగొట్టేస్తుంది.
అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్న దివి సోషల్ మీడియాలో బాగా సంపాదిస్తుందని చెప్పొచ్చు.ఫోటో షూట్స్ ( Photo shoots )తో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

లేటెస్ట్ గా దివి పాప తన బర్త్ డే సందర్భంగా సాగర కన్య( Sagara Kanya )గా మారిపోయింది.బీచ్ సైడ్ సముద్ర కన్యగా దివి లుక్స్ అదిరిపోయాయి.దివిలోని ఈ టాలెంట్ ఎందుకు దర్శకులు గుర్తించట్లేదు అన్నది తెలియట్లేదు.ఇక తనని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు తన టాలెంట్ తను చాటుతా అంటూ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది దివి.
ఏది ఏమైనా ఈ అమ్మడు సినిమాల విషయం లో సీరియస్ గా ఉంటే మాత్రం టాప్ హీరోయిన్స్ కి కూడా పోటీ వస్తుందని చెప్పొచ్చు.తెలుగు అమ్మాయి కాబట్టి మన వాళ్లు చిన్న చూపు చూస్తున్నారేమో కానీ బయట ఇండస్ట్రీకి వెళ్తే దివిని స్టార్ ని చేసే అవకాశం ఉంది.






