వేసవికాలంలో బీర సాగులో పాటించాల్సిన సస్యరక్షక పద్ధతులు..!

వేసవికాలంలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి.ఇక తీగజాతి కూరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Plant Protection Methods To Be Followed In Ridge Guard Cultivation In Summer , R-TeluguStop.com

మార్కెట్లో బీర( ridge guard ), సొర, దోస లాంటి కూరగాయలకు డిమాండ్ చాలా ఎక్కువ.ఎందుకంటే వేసవికాలంలో నీటి వనరుల సమస్య, ఎండబెట్ట సమస్యలు ప్రధానంగా ఉండే సమస్యలు.

వేసవికాలంలో నీటి వనరులు సమృద్ధిగా లేకపోతే ఉష్ణోగ్రతల కారణంగా మొక్క సరిగా ఎదగకపోవడం, బెట్ట కొట్టి వాడిపోవడం, చీడపీడల సమస్య వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి.బీర సాగును పందిరి విధానంలో కొన్ని సస్యరక్షక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందవచ్చు.

బీర పంట వేసిన మూడు వారాలకే కోతకు వస్తుంది.కాబట్టి పెట్టిన పెట్టుబడి మూడు వారాల నుంచి చేతికి రావడం మొదలవుతుంది.

ముందుగా నేలను బాగా కలియదున్ని, ఆఖరి దుక్కిలో పశువుల ఎరువులను( Animal manure ) వేయాలి.ఇక మార్కెట్లో ఎక్కువగా హైబ్రిడ్ విత్తనాలే అందుబాటులో ఉంటున్నాయి.వ్యవసాయ క్షేత్ర నిపుణుల ( Agricultural experts )సలహాతో మేలురకం విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.ఆ తర్వాత నేలలో శాశ్వతంగా పందిరి వేయాలనుకుంటే 10 *10 అంగుళాల పొడవు, వెడల్పుతో, 8 అడుగుల ఎత్తు ఉండే కాంక్రీట్ సంభాలను పొలంలో పాదు కోవాలి.

ఆ తర్వాత మడులకు, సాళ్లకు మధ్య 100 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.నీటిని పారించకుండా బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తే వేసవికాలంలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తవు.

ఇక విత్తే సమయంలో తేమ లేకపోతే నీటిని పారించి ఆ తర్వాత విత్తనాలు విత్తు కోవాలి.ఇక క్రమం తప్పకుండా భూమిలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.

పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏవైనా పురుగులు ఆశిస్తే తొలిదశలోనే వాటిని పూర్తిగా నివారించడం కోసం తేలికపాటి పిచికారి మందులను ఉపయోగించాలి.ఈ పద్ధతులు పాటిస్తే వేసవికాలంలో బీర సాగులో అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube