ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ భవిష్యత్తులో స్టార్ స్టేటస్ అందుకుని సంచలనాలు సృష్టిస్తాడని అందరూ భావించారు.అయితే విచిత్రంగా కుమారి 21ఎఫ్ తర్వాత దాదాపుగా 15 సినిమాలలో నటించిన రాజ్ తరుణ్ కు ఆ స్థాయి విజయాలు అయితే దక్కలేదు.
కొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచినా ఆ సినిమాలు రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ కాలేదు.పారితోషికానికి ఆశపడి కథలతో సంబంధం లేకుండా ఒకే బ్యానర్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం, కథనం పట్టించుకోకపోవడం, ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వదం, ఫ్లాప్ డైరెక్టర్లను రిపీట్ చేయడం, రిలీజ్ డేట్లను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం, సినిమాలకు సరైన ప్రమోషన్స్ జరిగే విధంగా చేసుకోలేకపోవడం రాజ్ తరుణ్ కెరీర్ నాశనం కావడానికి కారణాలు అని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ కు ఆఫర్లు సైతం తగ్గుముఖం పట్టాయి.దర్శకుడు మారుతి( Director Maruti ) కథతో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది.
సాయి వర్థన్( Sai Varthan ) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ షూట్ మొదలుకానుండగా ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది.
రాజ్ తరుణ్ పారితోషికం తక్కువగానే ఉందని తెలుస్తోంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర వెరైటీగా ఉంటుందని బోగట్టా.
రాజ్ తరుణ్ కు ఇకనైనా వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.








