ప్రభాస్ ఆస్తుల విలువపై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు.. విలువ ఎంతంటే?

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) పారితోషికం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ పెళ్లికి సంబంధించి, ప్రభాస్ ఆస్తుల గురించి నాగరాజు ( Nagaraju ) అనే ఆర్టిస్ట్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Shocking Facts About Prabhas Assets Value Details, Prabhas, Prabhas Assets, Prab-TeluguStop.com

ప్రభాస్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఎంతో విలువైన భూములు ఉన్నాయని ఆయన అన్నారు.ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం ప్రభాస్ కు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని బోగట్టా.

శ్రీదేవి చిన్నప్పుడు మా ఇంటికి వచ్చిన సమయంలో కుక్క కరిచిందని నాగరాజు తెలిపారు.

నాకు ఇండస్ట్రీలో అందరూ సుపరిచితులే అని ఆయన పేర్కొన్నారు.

మేము 1964లో హోటల్ బిజినెస్ మొదలుపెట్టామని నాగరాజు అన్నారు.మా హోటల్ లో కపిల్ దేవ్ గారు ఉన్న సమయంలో రోటీ, పన్నీర్ ఎక్కువగా తీసుకున్నారని కపిల్ దేవ్ కు పన్నీర్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందేనని ఆయన తెలిపారు.

గత 30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానని నాగరాజు కామెంట్లు చేయడం గమనార్హం.

తెలుగుదేశం పార్టీలో నేను మెంబర్ గా చేరలేదని అయితే ఆ పార్టీకి సపోర్ట్ చేశానని నాగరాజు కామెంట్లు చేశారు.ప్రభాస్ నా భార్య తరపు నుంచి బంధువు అవుతాడని ఆయన తెలిపారు.అప్పట్లో మీడియేటర్ ద్వారా కృష్ణంరాజును ( Krishnam Raju ) కలిసి ఫోటో దిగడానికి 100 రూపాయలు ఇచ్చానని నాగరాజు చెప్పుకొచ్చారు.

కృష్ణంరాజు సౌమ్యుడు, సరదాగా ఉంటారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రభాస్ ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడని ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం కష్టపడాలని ఆయన కామెంట్లు చేశారు.ప్రభాస్ కు హిందీలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని నాగరాజు పేర్కొన్నారు.ప్రభాస్ కు లేజీనెస్ లేదని ఆయన కామెంట్లు చేశారు.

ప్రభాస్ పెళ్లి చేసుకుని అందరినీ ఆనందించేలా చేస్తారని భావిస్తున్నానని ఆయన తెలిపారు.వరుస షూటింగ్ ల వల్ల ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతోందని నాగరాజు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube