తెలంగాణ గడ్డపై బీజేపీ ఆటలు సాగవని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.
మత విద్వేషాలతో పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ లాంటి దొంగ పార్టీని నమ్మే స్థితిలో లేరని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
బీజేపీ పార్టీతో దేశం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.బీజేపీ నేతలు ప్రపంచం ముందు దేశ పరువు తీస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా రావని తెలిపారు.







