సూర్యాపేట జిల్లా: రైతులకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని విధాల సహకరిస్తామని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ అన్నారు.ఆదివారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలు రైతులకు ఈ కమిటీ అందుబాటులో ఉంటుందన్నారు.
నేరేడుచర్ల,పాలకవీడు మండలాల్లో 39 గ్రామాల రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు,మరియు ధాన్యం ఆరబెట్టేందుకు రైతులకే మొదటి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
రైతుల తర్వాతే ట్రేడర్స్ కు, మిల్లర్లకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రతి గ్రామంలో రైతుల సమస్యలు తీర్చేందుకు మార్కెట్ కమిటీ సహకరిస్తుందన్నారు.మార్కెట్ ఫండ్ ద్వారా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని, మార్కెట్లో సంత ఏర్పాటు చేయాలని,బోర్ వేయాలని,కరెంటు సమస్య లేకుండా చూడాలని,మార్కెట్ కమిటీ ప్రతిపాదన చేసిందన్నారు.
గతంలో చిల్లేపల్లి ఉన్నటువంటి చెక్ పోస్ట్ ను మళ్లీ తిరిగి ప్రారంభించాలని కమిటీ తీర్మానం చేసిందన్నారు.రైతుల కోసం ట్రేడర్స్ ధాన్య వ్యాపారులు మార్కెట్లో కలవాలని చెప్పారు.
గ్రామాల్లో పంటలు పండించే రైతులను ఉత్తమ రైతులుగా గుర్తించి మార్కెట్ తరపున వారికి సన్మానాలు చేసి,తగిన బహుమతులు అందజేస్తామన్నారు.
మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి,ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతుల కోసం నిరంతరం శ్రమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సోమగాని మురళి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు,వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఇస్లావత్ చీనా నాయక్, సూపర్వైజర్ డి.అనిల్, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.