రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన షిప్.. 84 ఏళ్ల తర్వాత లభ్యం..

చరిత్రలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు కోట్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాయి.లెక్కలేని సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు.

 Wreck Of Ship That Sank In World War Ii Found In South China Sea Details, Montev-TeluguStop.com

ఇక ఆస్తి నష్టానికి అంతే లేదు.ఎన్నో యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమైతే మరికొన్ని గల్లంతయ్యాయి.

అయితే రెండవ ప్రపంచ యుద్ధం( Second World War ) జరుగుతున్న సమయంలో మిస్సయిన ఒక నౌక తాజాగా లభ్యం అయింది.

యుద్ధ నౌక( War Ship ) నీటిలో మునిగిపోయినప్పుడు అందులో 864 మంది యుద్ధ ఖైదీలు ఉన్నారు.1942 జులైలో ఫిలిప్పీన్స్ తీరంలో ఈ నౌక మునిగిపోయింది.అంటే ఇప్పటికీ అది మునిగిపోయి 84 సంవత్సరాలు గడిచిపోతుందని చెప్పవచ్చు.

మునిగిపోయిన ఈ నౌక ఒక జపాన్ మెర్చంట్ షిప్ అని అంటున్నారు.ఈ నౌకను దక్షిణ చైనా సముద్రంలో( South China Sea ) డీప్ సీ సర్వే ఎక్స్‌పర్ట్స్ కనుగొన్నట్లు ఒక రిపోర్ట్ పేర్కొంది.

ఆ రిపోర్టు ప్రకారం, ఫిలిప్పీన్స్ తీరంలో దక్షిణ చైనా సముద్రంలో 1,000 మందికి పైగా ప్రయాణికులతో మునిగిపోయిన మాంటెవీడియో మారు( Montevideo Maru ) అనే జపనీస్ ఓడ కనుగొనబడింది.మాంటెవీడియో మారు మునిగిపోయినప్పుడు దాదాపు 1,000 మంది ఆస్ట్రేలియన్లు మరణించారు.ఓడలో 850 మంది యుద్ధ ఖైదీలు, దాదాపు 200 మంది పౌరులు ఉన్నారు.వీరిలో అనేక మంది ఆస్ట్రేలియన్లను 1942లో పాపువా న్యూ గినియాలో జపనీయులు బంధించారు.

మాంటెవీడియో మారు మునిగిపోవడం ఆస్ట్రేలియన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన.యూఎస్ఎస్ స్టర్జన్ అనే అమెరికన్ జలాంతర్గామి ఈ ఓడను ముంచేసిందని తెలుస్తోంది.ఆస్ట్రేలియన్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్, ఆస్ట్రేలియా సైలెంట్‌వరల్డ్ ఫౌండేషన్‌కు చెందిన మెరైన్ ఆర్కియాలజిస్టులు, డచ్ డీప్-సీ సర్వే కంపెనీ ఫుగ్రో నిపుణుల కలిసి ఈ నౌక శిథిలాలను కనుగొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube