వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ రేర్ ఫీట్ సునాయాసంగా సాధించి 5వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని( Kodali Nani ) కి ఈసారి నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా లేవంటూ వార్తలు వస్తున్నాయి.గుడివాడ నియోజకవర్గంలో 2 లక్షల పై చిలుకు వోట్లు ఉన్నాయి .
ఇందులో దాదాపు సగానికి పైగా బీసీ ఓట్లు, సుమారు 40,000 ఎస్సీ ఎస్టీ ఓట్లు ఒక 30 వేల వరకు కాపు కాపు సామాజిక వర్గం ఓట్లు 10 నుంచి 15 వేల మధ్య కమ్మ సామాజిక వర్గం ఓట్లు మిగిలినవి ఇతరులు ఉంటారని.మొదటి నుంచి దళిత సామాజిక వర్గం వైసీపీకి అండదండగా ఉన్నందున ఆ ఓట్లు పార్టీ అకౌంట్లో కొడాలి నాని కి పడుతున్నాయని తన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి ఉండడం, కావాల్సిన పనులు చేసిపెట్టడం …వంటి వాటి ద్వారా బీసీలలో సగం ఓట్లను ఆయన ఆకట్టుకోగలుగుతున్నారని వంగవీటి రాధ వంటి నేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా ఈయనపై పాజిటివ్గా ఉంటారని ఈ కారణాల వల్ల ఆయన గత నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలవగలిగారని, అయితే ఇప్పుడు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలలో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు .
పవన్ కళ్యాణ్ ( Pawan klayan )పట్ల విపరీతమైన విమర్శలు చేసి ఉన్నందున కాపు సామాజిక వర్గం అభిమానం నుంచి కొడాలి నాని దూరమయ్యారని.ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం వల్ల బీసీలు మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరవుతున్నారని నాలుగు ధపాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కూడా గుడివాడలో అభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదన్న అభిప్రాయాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఆయన కుమారుడి పై వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేయడం కమ్మ సామాజిక వర్గంలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగినట్లుగా తెలుస్తుంది .
ఇలా మారిన సమీకరణాల నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు అంత సులువుగా ఉండబోదని వ్యతిరేక తప్పదని ఎన్నికల దగ్గర్లో అనూహ పరిణామాలు ఎదురైతే తప్ప ఆయన గెలుపు ఈ సారి కష్టమేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి
.