కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే మీ డైట్ లో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే!

కిడ్నీలో రాళ్లు ( Kidney Stones ).ఇటీవల రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

 This Drink Helps To Get Rid Of Kidney Stones!, Kidney Stones, Kidney Stones Remo-TeluguStop.com

శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు, మూత్రాన్ని గంటలు తరబడి ఆపుకోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.వీటిని స్టార్టింగ్ స్టేజ్ లోనే కరిగించుకునేందుకు ప్రయత్నించాలి.

లేదంటే ఆపరేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.మీరు కూడా కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా.? అయితే ఖ‌చ్చితంగా మీ డైట్ ( Diet )లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఉండాల్సిందే.

Telugu Tips, Kidney, Kidney Removal, Kidneys, Latest-Telugu Health

ఈ డ్రింక్ కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే మూత్రపిండాలను( Kidneys ) ఆరోగ్యంగా మారుస్తుంది.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఆరెంజ్ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

చివరిగా ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఆపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు,( Water Melon ) రెండు టేబుల్ స్పూన్లు లెవెన్ జ్యూస్ మరియు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా తయారైన డ్రింక్ ను నేరుగా సేవించాలి.రోజుకు ఒక గ్లాసు చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి.

Telugu Tips, Kidney, Kidney Removal, Kidneys, Latest-Telugu Health

అలాగే ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులకు సైతం దూరంగా ఉండవచ్చు.ఇక ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం తో పాటు వాటర్ ను శరీరానికి సరిపడా అందించాలి.అలాగే చాక్లెట్లు, పాలకూర, సోయా, చిక్కుడు, టమాటా( Tomato ) వంటి ఆక్సలేట్ పదార్థాలు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తినకూడదు.మరియు మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకునే అలవాటును కూడా మానుకోండి.

తద్వారా కిడ్నీలో రాళ్లు త్వరగా కరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube