వచ్చే ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించాలని బలంగా కోరుకుంటున్న జనసేన పార్టీ( Janasena party ) ఆ దిశగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగుతుంది.అధినేత రెండు చోట్ల ఓడిపోయిన పార్టీ అంటూ వస్తున్న విమర్శలకు ఈసారి చెక్ పెట్టాలని అధినేతతో పాటు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యేలనుగెలిపించుకోవాలని కుదిరితే అధికారంలోకి కూడా రావాలని ఆ పార్టీ ఆలోచిస్తుంది.
అయితే జనసేనకు మొదటి విజయం గాజువాక( Gajuwaka ) నుంచి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి .సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గతసారి గాజువాక చేజారింది తప్ప జనసేనకి అన్ని రకాలుగా అనుకూలమైన నియోజక వర్గం అని కాపు సామాజిక వర్గం అధికం గా ఉండడం తో పాటు పవన్ అభిమానులు కూడా బారిసంఖ్యలో ఉన్నారని అయితే.పవన్( Pawan ) సొంత జిల్లా పశ్చిమగోదావరి అయినందున భీమవరం నుంచి కూడా పోటీ చేస్తున్నందన .గెలిస్తే గాజువాకను వదిలేస్తారు అన్న ప్రతిపక్ష నేతల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం వల్లే అక్కడ పవన్ ఓడిపోయారని జనసెన క్యాడర్ కూడా ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడం లో విఫలం అయ్యిందని సమాచారం అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ పార్టీ ( YCP party )విధానాల పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత గూడు పట్టుకుందని, అక్కడ ఎమ్మెల్యే నాగిరెడ్డి కూడా ప్రజాభిమానాన్ని గెలుచుకోవడంలో విఫలమయ్యారని .జనసేన పార్టీ కూడా సంస్థగతంగా రాటుదేలినందున ఈసారి గెలుపు పక్కా అంటూ ఇక్కడ నుంచి పోటీ చేయమంటూ అధినేతను ఒత్తిడి చేస్తున్నారట అక్కడ జనసైనికులు.

గత ఎన్నికల్లో టిడిపి( TDP ) తో పొత్తు లేనందున 50 వేలు ఓట్ల పైచిలుకు టిడిపి అభ్యర్థికి చీలిపోయాయి దాంతో 15 ఓట్ల తేడాతో పవన్ అక్కడి నుంచి ఓడిపోయారు .ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు దాదాపు కన్ఫామ్ అని వార్తలు వస్తున్నందన.గాజువాకలో పవన్ కు తిరుగు ఉండదని ఈ రెండు పార్టీల వోట్లు కలిపితే దాదాపు 50 వేల మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది వార్తలు వస్తున్నాయి.
గాజువాక నుంచి పోటీ చేయడానికి పవన్ కూడా సుముఖంగా ఉన్నారని….అందువల్ల ఈసారి గాజువాక ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమైందంటూ వార్తలు వస్తున్నాయి.







