కర్నాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత పెరుగుతోంది, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నాయి.ప్రజలను ఆకర్శించేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తూ మ్యానిఫెస్టోలను ప్రజల ముందు ఉంచుతున్నాయి.
అదే సమయంలో ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ ఓటర్లను కూడా రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.కాగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్( Congress, BJP, JDS ) పార్టీల మద్య త్రిముఖ పోరు ఉన్నప్పటికి ప్రధాన పోరు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మద్యనే.
ఈ రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడుతున్నాయి.దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు.కేంద్రంలో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉందని అందువల్ల రాష్ట్రంలో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని కమలనాథులు ప్రతి ప్రచారంలోనూ చెబుతున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీనే గెలుస్తుందని, అందువల్ల రాష్ట్రంలో మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వకపోతే రాష్ట్రమే నష్టపోతుందని పదే పదే చెబుతున్నారు.
రాష్ట్రనికి సరిపడ నిధులు విడుదల చేయాలన్న, కేంద్ర సహకారం రాష్ట్రనికి కావాలన్న డబుల్ ఇంజన్ సర్కార్ ( Double engine Sarkar )ఎంతో అవసరం అని కమలనాథులు చెబుతున్నారు.డబుల్ ఇంజన్ సర్కార్ అంశాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుతున్నారు బీజేపీ నేతలు.అయితే బీజేపీ ఎత్తుకున్న ఈ డబుల్ ఇంజన్ నినాదాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.డబుల్ ఇంజన్ పేరుతో బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని, మరొకసారి బీజేపీని నమ్మితే రాష్ట్రం అల్లకల్లోలం కావడం కాయమని హస్తం నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.
ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రనికి ఏం చేయలేదని అందుకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత బీజేపీ పై కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక రెండు ప్రధాన పార్టీలు వ్యూహానికి ప్రతివ్యూహంగా ప్రణాళికలను అమలు చేస్తూ కర్నాటక పాలిటిక్స్ ను హిటెక్కిస్తున్నాయి.
మరి ఎన్నికల్లో కన్నడ ప్రజలు ఏ పార్టీ పక్షాన నిలుస్తారో చూడాలి.