నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతంపై భారత పర్వతారోహకుడు అనురాగ్ మాలూ( Mountaineer Anurag Maloo ) గల్లంతైన విషయం అందరికీ తెలిసినదే.కాగా మాలూను పోలాండ్‌కు చెందిన పర్వతారోహకుడు ఆడమ్ బీలెక్కి( Adam Bielecki ) రక్షించడం జరిగింది.
దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ( Rescue operation )కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.తాజాగా రెస్క్యూకు సంబంధించిన వీడియోను ఎవరెస్టు టుడే సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేయగా నెటిజన్లు ఆ వీడియోని తెగ చూస్తున్నారు.
అంతేకాకుండా ఆ వీడియోని విపరీతంగా షేర్స్ చేస్తున్నారు.

అన్నపూర్ణ పర్వతం( Annapurna mountain )పై పగుళ్లలో అనురాగ్ మాలూ పడిపోయి కూరుకుపోయారు.అయితే ఆయన్ని ఆ పగుళ్ల లో నుంచి బయటకు తీస్తున్న విజువల్స్ ను ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు.అనురాగ్ మాలూను సురక్షితంగా తీసుకురావడంపై ఎవరెస్ట్ టుడే తాజాగా స్పందించింది.
ఆడమ్ బీలెక్కి అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి మాలూను తీసుకువచ్చారని ఎవరెస్టు టుడే పేర్కొంది.అందుకు బీలెక్కికి ధన్య వాదాలు తెలుపతున్నట్టు పేర్కొంది.

ఇకపొయే గత వారం మౌంట్ అన్నపూర్ణ పర్వతంపైకి వెళ్లిన అనురాగ్ మాలూ తొలుత బాగానే అక్కడికి చేరుకున్నారు.పర్వతం ఎక్కే క్రమంలో మధ్యలో పగుళ్లు ఏర్పడి ఉండడంతో తడబడి ఆ పగుళ్లలో పడి పోయాడు.దాంతో ఆయన్ని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.ఈ క్రమంలోనే ఆడమ్ బీలెక్కి అతగాడిని కాపాడాడు.కాగా అతను సజీవంగా ఉన్నట్లు గురువారం అధికారులు గుర్తించారు.విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయన్ని హాస్పిటల్‌కు తరలించారని సోదరుడు సుధీర్ తెలిపాడు.






