ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి.ఆన్ లైన్ లో సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
ప్రముఖ నటి ఐశ్వర్య( Aishwarya ) తాజాగా ఒక సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.సోప్ బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో నేను ఫోన్ నంబర్ ను షేర్ చేశానని ఆమె కామెంట్లు చేశారు.
అప్పటినుంచి నా ఫోన్ నంబర్ కు అసభ్యకరమైన ఫోటోలు( Indecent photos ), అనుచిత సందేశాలు వస్తున్నాయని ఐశ్వర్య వెల్లడించారు.కొందరు మగవాళ్లు తమ ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారని అలాంటి ఫోటోలు రావడంతో తాను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ వేధింపులు ఇదే విధంగా కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఐశ్వర్య అన్నారు.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐశ్వర్య ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

ఐశ్వర్య భాస్కరన్ ( Aishwarya Bhaskaran )తన కూతురి సలహాతో ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నానని పేర్కొన్నారు.ఐశ్వర్య భాస్కరన్ నటనకు తెలుగులో కూడా చాలామంది ఉన్నారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో ఎక్కువగా నటించి ఆమె ప్రశంసలు అందుకున్నారు.గతంతో పోల్చి చూస్తే ఆమెకు మూవీ ఆఫర్లు తగ్గగా సోప్స్ బిజినెస్ ద్వారా ఆమె కెరీర్ ను కొనసాగిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రముఖ దర్శకనిర్మాతలు ఐశ్వర్య భాస్కరన్ కు సినిమా ఆఫర్లు ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఐశ్వర్య భాస్కరన్ టీవీ సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.తనకు అసభ్యంగా సందేశాలు పంపుతున్న వారిపై ఐశ్వర్య భాస్కరన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సూచనలు చేస్తున్నారు.







