హీరోయిన్ల కి అవకాశాలు రావాలి అంటే వాళ్ల ముందు సినిమాలూ హిట్ అయ్యాయా లేదా అనేది ఇండస్ట్రీ లో కీలక పాత్ర వహిస్తుంది హిట్స్ ఉన్న హీరోయిన్స్ కే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా వస్తాయి…ప్రస్తుతం సంయుక్త మీనన్( Samyuktha Menon ) వరుస హిట్స్ తో ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది… టాలీవుడ్ లో ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార,అలాగే సార్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి.అలాగే తాజాగా విడుదలైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది .
దీనితో ఆమె గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది .

వాస్తవంగా చెప్పుకోవాలంటే .టాలీవుడ్ హీరోయిన్ల విషయంలో ఎక్కువగా గోల్డెన్ లెగ్.ఐరన్ లెగ్ అనే మాటలు వినిపిస్తుంటాయి.
సినిమా రిజల్ట్ లో ఇతర నటీనటుల పాత్ర ఎంత ఉంటుందో.హీరోయిన్ పాత్ర కూడా అంతే.
కానీ సినిమా హిట్ అయితే ఆమె గోల్డెన్ లెగ్ అని.కాకపోతే ఐరన్ లెగ్ అని ఆపాదిస్తుంటారు.

రీసెంట్ గా ఇంటర్వ్యూలో విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు సంయుక్త మీనన్( Karthik Dandu ) గురించి నోరు జారారు.మీడియా మొత్తం సంయుక్త మీనన్ ని గోల్డెన్ లెగ్ అని పిలవడంపై కార్తీక్ మాట్లాడారు.సంయుక్త మీనన్ బింబిసార చిత్రం రిలీజ్ కాకముందే విరూపాక్ష చిత్రానికి సైన్ చేసింది.మీరంతా సంయుక్తని గోల్డెన్ లెగ్ అంటున్నారు.సంయుక్త వచ్చాకే సాయిధరమ్ తేజ్ కి యాక్సిడెంట్( Sai Dharam Tej ) అయింది అంటూ సరదాగా మాట్లాడుతూనే నోరు జారారు.దీనితో కార్తీక్ వంక సంయుక్త సీరియస్ గా చూసింది.
ఆ తర్వాత కార్తీక్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ సెంటిమెంట్‌పై సంయుక్త మీనన్ స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.

అసలు ఈ కాన్సెప్టే చాలా బ్యాడ్ కన్సెప్ట్ అంటూ కొట్టిపారేసింది సినిమా సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి అందరూ బాధ్యులే అని వెల్లడించింది .ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అని కొట్టిపారేసింది .సినిమాకి తక్కువ ఎఫర్ట్స్ పెట్టి, సినిమా సక్సెస్ అయ్యిందంటే అది లక్కీ.హీరోయిన్ మంచి స్క్రిప్ట్ లు సెలక్ట్ చేసుకుని, బాగా నటించి, మంచి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వచ్చే సక్సెస్, అసలైన సక్సెస్.
గోల్డ్ , ఐరన్ అనే చెత్తలోకి హీరోయిన్‌ని లాగకండి.ఒక సినిమాకి కాస్టింగ్ అనేది ఆయా పాత్రకి, ఆమె న్యాయం చేస్తుందా.ఆ పాత్రని మోయగలదా.అనేదాన్ని బట్టి ఎంపిక ఉంటుంది అని చెప్పుకొచ్చింది . విరూపాక్ష సినిమాతో వరుసగా నాలుగు హిట్లు అందుకొని ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసింది…ఇప్పుడు సంయుక్త చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి…
.







