సాధారణంగా మనకి క్యాబ్ సర్వీస్( Cab service ) అంటే ముందుగా ఓలా, ఉబెర్ కంపెనీలు స్ఫురణకు వస్తాయి.ఎందుకంటే దేశంలో ఈ క్యాబ్ సర్వీసులు చాలా పాపులర్ అయ్యాయి.
దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇవి కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి.అయితే వీటికి ఇపుడు గట్టిపోటీ ఇచ్చేందుకు ఇండియన్ రైడ్ హెయిలింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ సిద్ధమైంది.
అయితే ఈ సంస్థ ట్యాక్సీలుగా ఎలక్ట్రిక్ కార్లనే వినియోగించడం విశేషం.బెస్ట్ ఆఫర్లు, డీల్స్‌తో మార్కెట్‌లో కస్టమర్లు, డైవర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది బ్లూస్మార్ట్.

ఈ జూన్‌లో ఇండియన్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్ నుంచి కస్టమైజ్డ్, చిన్న ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి, ఛార్జీలను తగ్గించుకునే ఆలోచనలో పడింది.పెద్ద కస్టమర్ బేస్‌ను చేరుకోవడానికి చిన్న ఎలక్ట్రిక్ వాహనాలు అవసరమని బ్లూస్మార్ట్ సీఈవో అన్మోల్ సింగ్ జగ్గీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.బ్లూస్మార్ట్ సర్వీసెస్( BlueSmart ) ఢిల్లీలో సక్సెస్ అయ్యాయి.కాగా ఇక్కడ 2022 జనవరి, అక్టోబర్ మధ్య రిజిస్టర్ అయిన కొత్త ఎలక్ట్రిక్ టాక్సీలలో 80% ఈ కంపెనీకి చెందినవే.
ఈ క్రమంలోనే బ్లూస్మార్ట్ ఢిల్లీలో 22 ఛార్జింగ్, పార్కింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇకపోతే, బ్లూస్మార్ట్ తన ఎలక్ట్రిక్ ట్యాక్సీలను( Electric cars ) వచ్చే సంవత్సరం 14,000కి, ఐదేళ్లలో 100,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అదే సమయంలో ఉబెర్ తరహాలో మరో 4 నగరాలకు సేవలు విస్తరించి, మరిన్ని ఇన్‌స్టాంట్ బుకింగ్‌లు అందించేలా ప్లాన్ చేస్తోంది బ్లూస్మార్ట్.అంతేకాకుండా ఇన్వెస్టర్లను కూడా ఆకర్షించేందుకు ఉబెర్( Uber )లోని సమస్యలను లేవనెత్తుతోంది.మార్చిలో బ్లూస్మార్ట్ పెట్టుబడిదారులకు చేసిన కాన్ఫిడెన్సియల్ ప్రెజెంటేషన్‌తో ఇండియాలో ఉబెర్ డ్రైవర్లు, కస్టమర్లు తగ్గిపోవడం ప్రారంభమైందని రాయిటర్స్ తాజాగా పేర్కోవడం దానికి చిహ్నమే.







