హైదరాబాదులో దారుణం.. 8 ఏళ్ల బాలుడి నరబలి..!

ప్రపంచం ఎంత అభివృద్ధి చెందిన సమాజంలో మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వీడడం లేదు.క్షుద్ర పూజలు, నర బలులు( Occult Pujas, Nara Sacrifices ), చేతబడులు లాంటివి చేస్తే అదృష్టం తలుపు తడుతుందని మూఢనమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు.

 Atrocious In Hyderabad Human Sacrifice Of An 8-year-old Boy , Abdul Waheed, Sana-TeluguStop.com

ఈ క్రమంలోనే హైదరాబాదులో ఓ 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన సంఘటన బయటపడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.వివరాల్లోకెళితే.

గురువారం రాత్రి హైదరాబాద్లోని సనత్ నగర్( Sanat Nagar ) లో 8 ఏళ్ల బాలుడు మృతి చెందడంపై అనేక రకాల అనుమానాలు నెలకొన్నాయి.గురువారం అమావాస్య కావడంతో కచ్చితంగా నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హిజ్రా మహిళ బాలుడిని నరబలి ఇచ్చి, మృతదేహాన్ని ఓ కాలువలో పడేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ఆ బాలుడి పేరు అబ్దుల్ వహీద్( Abdul Waheed ) గుర్తించారు.అయితే ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఇమ్రాన్ అనే హిజ్రా ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారు.8 ఏళ్ల అబ్దుల్ వహీద్ ను చంపి ప్లాస్టిక్ సంచిలో మూతి కట్టి మురికి కాలువలో పడేసినట్లు సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయినట్లు తెలుస్తుంది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఇమ్రాన్ ఈ హత్య చేశాడా.? ఇమ్రాన్ తో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా.? ఈ బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇక బాలుడి మృతి పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani Srinivas Yadav )స్పందిస్తూ.8 ఏళ్ల అబ్దుల్ వహీద్ హత్యకు గురి కావడం చాలా బాధాకరం అని, ఈ హత్యకు పాల్పడిన దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఏది ఏమైనా 8 ఏళ్ల బాలుడి నరబలి హైదరాబాద్ నగరమే ఉలిక్కిపడేలా చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube