అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమా ( Agent Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో అఖిల్ సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమాపై అఖిల్( Akhil ) సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అఖిల్ సైతం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ ఏజెంట్ యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయనీ ఈ సినిమా తప్పకుండా చూడాలని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో మల్టీ స్టార్ సినిమాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్య ముఖ్యంగా తన ఫ్యామిలీతో కలిసి నటించే విషయం గురించి అఖిల్ మాట్లాడుతూ… మనం సినిమా( Manam Movie ) లాంటి కథలు తరచూ చేయడం సాధ్యం కాదు.

ఇలాంటి సినిమాలను కావాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్స్ కి ఉన్న విలువ పోతుందని తెలిపారు.ఇక నాగచైతన్య ( Nagachaitanya )తో కలిసి నటించడం గురించి కూడా ఈయన మాట్లాడారు అన్నయ్యతో కలిసి చేసే అవకాశం ఉన్నటువంటి స్క్రిప్ట్ ఇప్పటివరకు రాలేదు.ఒకవేళ అలాంటి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేస్తానని తెలిపారు.
ప్రస్తుతమైతే మల్టీస్టారర్ సినిమాల గురించి తాను ఏ విధంగాను ఆలోచించలేదని, ఒకవేళ మల్టీ స్టారర్ సినిమా కనుక చేయాల్సి వస్తే తప్పకుండా రామ్ చరణ్ ( Ram Charan )తో చేస్తానని ఈ సందర్భంగా తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు.మరి రామ్ చరణ్ ( Ram charan ) తన సినిమాలో అఖిల్ కు ఛాన్స్ ఇస్తారా ఆయన కోరిక తీరుస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.







