గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం... మంత్రి పువ్వాడ అజయ్ అభినందన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామ పంచాయతీకి ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై జాతీయ స్థాయిలో పురస్కారం లభించిడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్‌ పొడియం సుజాత అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 National Award To Gautampur… Minister Puvvada Ajay Abhinandana-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్, జెడ్పీ CEO విద్యాలత, DPO రమాకాంత్, సర్పంచ్ సుజాత, పంచాయతీ కార్యదర్శి షర్మిల, MPO సత్యనారాయణ, శుక్రవారం VDO’S కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం వారికి శాలువాకప్పి సత్కరించారు.ఇలాంటి అరుదైన గౌరవం భద్రాద్రి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి అని, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ సారథ్యంలో గతంలో స్వచ్ఛ గ్రామీణ్‌కు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు రావడంతో జిల్లాకు గర్వకారణం అన్నారు.

తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి దేశానికి గీటురాయిగా నిలవడంలంటిదన్నారునేడు ఉత్తమ పంచాయతీలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకొని నేడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికై ప్రశంసలు అందుకున యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube