తెలంగాణలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.ఆపరేషన్ ఆకర్ష్, ఘర్ వాపసీకి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
మే మొదటివారంలో ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.టూర్ లో చేరికలు ఉండేలా కసరత్తు మొదలు పెట్టింది పార్టీ.
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీ చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు కూడా ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.







