హీరోయిన్ రంభ( Rambha ) గురించి ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు.అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది రంభ.
తెలుగులో అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, భైరవద్వీపం,అరుణాచలం, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు,మాతో పెట్టుకోకు, రౌడీ అన్నయ్య లాంటి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రంభ.
అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్( Chiranjeevi, Balakrishna, Venkatesh ), లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక అప్పట్లో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది హీరోయిన్ రంభ.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ ఎన్టీఆర్ డ్యాన్స్( NTR Dance ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఈ తరం హీరోయిన్లలో నాకు హీరోయిన్ త్రిష ( Trisha )అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే ఆమెతో రెండు మూడు సార్లు కలిసినప్పుడు మాట్లాడాను చాలా బాగా మాట్లాడుతుంది.చాలామంది హీరోయిన్లు తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు అని చెప్పుకొచ్చింది రంభ.ఈతరం హీరోలలో ఎవరితో నటిస్తారు అని యాంకర్ అడగగా మహేష్ బాబు, ప్రభాస్( Mahesh Babu and Prabhas ) తో ఇప్పటివరకు సినిమాలు చేయలేదు.ఒకవేళ అవకాశం వస్తే ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది రంభ.అనంతరం తాను చేసిన ఐటెం సాంగ్స్ గురించి మాట్లాడుతూ నాచోరే నాచోరే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అందులో జూనియర్ ఎన్టీఆర్ కష్టపడినప్పటికీ క్రెడిట్ అంతా నేనే కొట్టేశాను అని నవ్వుతూ తెలిపింది రంభ.మీతో డాన్స్ చేసిన వారిలో డాన్సర్ ఎవరు అని ప్రశ్నించగా.ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అనగా వెంటనే యాంకర్ మరి ప్రభుదేవా అని అనడంతో కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా మాస్టర్ వెరీ గుడ్ అని తెలిపింది.బట్ ఒక డాన్సర్ గా మాత్రం ఒక సినిమాలలో అలా కన్నారపకుండా చూస్తూ ఉండాలి అనుకున్న డాన్సులలో ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చింది.