కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్టు గా అనేక సర్వే రిపోర్ట్ లు బయటకు రావడం తో ఆ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండడం, కేంద్ర బిజెపి పెద్దలంతా కర్ణాటక ఎన్నికలపై ఫోకస్ పెట్టడం, భారీగా సొమ్ములు ఖర్చు పెడుతుండడం వంటివన్నీ కాంగ్రెస్ నిస్తుతంగా పరిశీలిస్తుంది.
బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కర్ణాటకలో కాంగ్రెస్( Karnataka elections ) గెలవడం ఖాయం అన్న అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం పెద్దలు ఉన్నారు.దీంతో పాటు గెలుపుకు ఎటువంటి లోకాలు లేకుండా చేసుకునేందుకు భారీగా స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దించుతుంది .ఇప్పటికే దీనికి సంబంధించి లిస్టును ప్రకటించారు.
ఈ జాబితాలో సోనియా గాంధీ( Sonia Gandhi ), రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, శశిథరూర్, జగదీష్ శెట్టర్ తదితరులకు అవకాశం కల్పించారు.వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ), కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీ న్ లకూ ఈ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో అవకాశం దక్కింది.మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించారు.
కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జయరాం రమేష్, వీరప్ప మొయిలీ, రణదీప్ సుర్జివాల, కేసు వేణుగోపాల్ , చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బగెల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కన్నయ్య కుమార్ తదితరులకు ఈ జాబితాలో చోటు కల్పించారు.
కానీ 2018 ఎన్నికల్లో స్టార్ క్యంపైనర్ గా వ్యవహరించిన సచిన్ పైలెట్ కు ఈ జాబితాలో చోటు దక్కలేదు.అయితే కాంగ్రెస్ కంటే ముందుగానే బిజెపి స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించింది.ఇందులో తెలంగాణ నుంచి బిజెపి జాతి ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ, లక్ష్మణ్( DK Aruna ) , తెలంగాణ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.