మహారాష్ట్రలో జెండా పాతుతున్న బారాస?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో కీలకం కావాలని అయితే కింగ్ అవ్వాలని లేకపోతే కనీసం కింగ్ మేకర్ అయినా అవ్వాలని భారీ టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్న బారాసాకు( Barasa ) మొదట్లో అంత అనుకూల పరిణామాలు జరగలేదు.కలిసి వస్తారని ఆశలు పట్టుకొని నేతలు రకరకాల కారణాలతో పక్కకు తప్పుకున్నప్పటికీ.

 Barasa Geeitng Good Responce Is Maharashtra ,brs, Maharashtra , Dalit Bandhu, R-TeluguStop.com

బారాస తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్ళింది.నాయకుల్ని కాకుండా ప్రజల్ని ఆకట్టుకుంటే ఆటోమేటిక్గా పార్టీలోకి వలసలు వస్తాయని భావించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా వ్యూహాల్ని రచించింది .ఇప్పుడు ఆ వ్యూహాలు విజయవంతమై పాలితాలు ఆ పార్టీ ని సంతోషపెడుతున్నటూగా తెలుస్తుంది .ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ప్రత్యేక హోదా , స్టీల్ ప్లాంట్ విషయాల్ని టేకప్ చేసి ఆంధ్ర రాజకీయాల లోకి చొచ్చుకుపోవాలన్న ఆ పార్టీ ప్రయత్నం కొంతవరకు విజయవంతమైనదనే చెప్పాలి ,, అలానే తన కీలక పథకాలైన దళిత బంధు , రైతుబంధు( Dalit Bandhu, Rythu Bandhu ) పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రచారంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులను దళితులను ఆకట్టుకుంటే జాతీయస్థాయిలో ఎదగటం సులువుతుందని ఆ పార్టీ అంచనాలు కొంత మేరకు విజయవంతమైనట్టే కనిపిస్తుంది.రైతు బంధు పథకం ప్రచారానికి మహారాష్ట్రలో అద్భుతమైన స్పందన కనిపిస్తుంది.

Telugu Barasageeitng, Dalit Bandhu, Maharashtra, Punjab, Rajasthan, Rythu Bandhu

చాలామంది కీలక నాయకులు బారాస లోకి వలస వస్తున్నారు .మహారాష్ట్రలో కనిపిస్తున్న ఈ వలసల తో బారసా పార్టీ అధిష్టానం చాలా ఆనందంగా ఉందని .ఈ పథకాలను మరింత విస్తృతంగా జాతీయస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా రాజస్థాన్ ,పంజాబ్ ( Rajasthan, Punjab )లాంటి వ్యవసాయదారిత రాష్ట్రాలను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్లాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.తెలంగాణ మాడెల్ ను దేశమంతా అమలు చేస్తామన్న ప్రచారం తమకు వోట్లు కురిపిస్తుందని బారసా అధిష్టానం బలం గా నమ్ముతుంది ఏది ఏమైనప్పటికీ అనుకున్నది చేయడంలో పట్టుదలగా ముందుకు వెళ్లే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలన్న తన కోరికను తీర్చుకోవడానికి వ్యూహతకంగానే ముందుకు వెళుతున్నాటూగా తెలుస్తుంది మరి జాతీయ రాజకీయాల్లో బారసా ప్రయాణం ఎలా సాగుతుందో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube