ఐపీఎల్ 23 ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపుతున్నాడు.బ్యాటర్ల డామినేషన్ నడుస్తున్న ఈ సీజన్‌లో సహచర పేసర్లు డౌన్ అవుతున్నా సిరాజ్ మాత్రం రెచ్చిపోతున్నాడు.
ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో సిరాజ్( Mohammed Siraj ) తీసింది 8 వికెట్లే అయినప్పటికీ.తన పేస్‌తో, స్వింగ్‌తో ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తున్నాడు.
ఈ క్రమంలో సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు 20 ఓవర్లు బౌల్ చేసిన సిరాజ్, ఏకంగా 69 డాట్ బాల్స్ వేసి, ఏ ఇతర బౌలర్‌కు సాధ్యం కాని ప్రత్యేకతని సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్-23లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సిరాజే అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా కొనసాగడం విశేషం.

అతని తర్వాత గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ 20 ఓవర్లలో( Mohammed Shami ) 65 డాట్ బాల్స్‌తో 10 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో వరుసగా లక్నో మార్క్ వుడ్ 16 ఓవర్లలో 48 డాట్ బాల్స్ 10 వికెట్లుతీసి తరువాతి స్థానంలోనూ, అదేవిధంగా గుజరాత్ అల్జరీ జోసఫ్ 19 ఓవర్లలో 48 డాట్ బాల్స్ 7 వికెట్లు తీసి నెక్స్ట్ స్థానాల్లో వున్నాడు.
ఆ తరు

వాత వరుసగా పంజాబ్ అర్షదీప్‌సింగ్, గుజరాత్ రషీద్ ఖాన్ లిస్టులో ఉన్నారు.ఈ రికార్డుతో పాటు సిరాజ్ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పడం కొసమెరుపు.అదేమంటే పవర్ ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఈ సీజన్‌లో పవర్‌ప్లేల్లో 72 బంతులు వేసిన సిరాజ్.ఏకంగా 51 డాట్ బాల్స్ వేసి, పవర్ ప్లేలో అత్యంత క్లిష్టమైన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు అని చెప్పుకోవచ్చు.ఈ సీజన్‌లో ఎకానమీ విషయంలోనూ సిరాజ్ స్టార్ స్పిన్నర్ అశ్విన్ (రాజస్థాన్)తో పోటీపడుతున్నాడు.







