ఇండస్ట్రీలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మోహన్ బాబు( Mohan Babu )కి పేరు ఉంది.ఆయన ఏ సినిమా చేసినా కూడా షూటింగ్ సమయంలో ఎంతో క్రమశిక్షణగా ఉంటారు.
తాను క్రమశిక్షణతో ఉండడం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండే వారు కూడా క్రమశిక్షణగా ఉండాలని కోరుకునే వ్యక్తి మోహన్ బాబు.క్రమశిక్షణ తప్పడంతో కొన్ని సార్లు సెట్ లో హీరోయిన్ లేదా ఇతర నటీనటులను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరగడం ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మంచు బ్రదర్స్ విష్ణు మరియు మనోజ్ మధ్య విభేదాలు తార స్థాయిలో ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.ఆ మధ్య మనోజ్( Manoj ) షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇద్దరి మధ్య గొడవలు పతాక స్థాయిలో ఉన్నాయని అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ.ఇద్దరి మధ్య గొడవ పతాక స్థాయిలో జరుగుతుంది అనేందుకు మాత్రం ఇదే నిదర్శనం అన్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకున్నారు.
మంచు మనోజ్ పెళ్లి ( Manchu Manoj’s wedding )విషయంలోనే అసలు గొడవ మొదలైందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.కేవలం మంచు విష్ణు ( Manchu Vishnu )మరియు మంచు మనోజ్ మధ్య విభేదాలు అనుకుంటే పొరపాటే.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మంచు విష్ణు మరియు మంచు లక్ష్మి మధ్య కూడా విభేదాలు తార స్థాయిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.గత కొన్నాళ్లుగా విష్ణు మరియు లక్ష్మి మాట్లాడుకోవడం లేదట.ఇదే సమయంలో మనోజ్ తో కలిసి లక్ష్మి చాలా సన్నిహితంగా ఉంటున్నారు.మంచు లక్ష్మి ఇంట్లోనే ఇటీవల మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి ల వివాహం జరిగింది.
అంతే కాకుండా తాజాగా కొత్త జంట మనోజ్, మౌనికలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని స్వయంగా మంచు లక్ష్మి దర్శణం చేయించారు.కనుక విష్ణు తోనే గొడవలు.మనోజ్ తో లక్ష్మీ బాగానే ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.