తమిళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ( Keerthy Suresh )తెలుగులో నటించిన మహానటి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన కీర్తి సురేష్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ బాగానే వచ్చాయి.స్కిన్ షో చేయకుండా కేవలం నటనపై దృష్టి పెట్టి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో రానించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సర్కారు వారి పాట సినిమా తో గత సంవత్సరం కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తాజాగా నాని తో కలిసి దసరా ( Dussehra )చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ నమోదు చేసిన కూడా ఇతర భాషల్లో మాత్రం కీర్తి సురేష్ క్రేజ్ తో కలెక్షన్స్ వస్తాయని ఆశించిన నిరాశే మిగిలింది.దసరా తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతానంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న కీర్తి సురేష్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ప్రకటించక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా కీర్తి సురేష్ తన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.దసరా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర బాగానే ఉన్నా.నిడివి చాలా తక్కువగా ఉంది.అందుకే ఆమెకు రావలసిన ఆదరణ ప్రాముఖ్యత దక్కలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే కీర్తి సురేష్ కొత్త సినిమా ఛాన్స్ లను అందుకోలేక పోతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో కాకుండా కనీసం తమిళంలో అయినా ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తే బాగుండు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావాలి అంటే కాస్త సమయం పట్టింది పట్టేలా ఉంది.ఈ లోపు వేరే భాషల్లో సినిమాల్లో చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.
కానీ కీర్తి సురేష్ మాత్రం తెలుగులోనే సినిమాలు చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది.అది కూడా స్టార్ హీరోలతో అవకాశాలు వస్తేనే చేయాలని ఆమె భావిస్తుందట.