విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఈఓఐ సమర్పించేందుకు రేపటి వరకే గడువు మిగిలి ఉంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) జారీ చేసిన నోటీసులకు 22 కంపెనీలు స్పందించాయి.ఈఓఐ సమర్పించిన కంపెనీల్లో ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు ఉండగా.
దేశాల జాబితాలో యుక్రెయిన్ కంపెనీ కూడా ఉంది.మరోవైపు స్టీల్ ప్లాంట్ పై ఆసక్తి కనబరిచిన తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఇంకా ఈవోఐ సమర్పించలేదు.
అయితే తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకే ఆర్ఐఎన్ఎల్ గడువును ఐదు రోజులపాటు పెంచింది.







