మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి( Manchu Manoj, Bhuma Mounika Reddy ) ఇటీవలే మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు .అంతేకాక తమ ప్రేమ, పెళ్లి వెనకాల నాలుగేళ్ల పోరాటం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ స్వయంగా తెలిపాడు .
ఇన్నాళ్లు పరిగెత్తామని, దేశ దేశాలు తిరిగొచ్చామని తెలిపారు.పెద్దలను ఎదురించి, ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఇక మనోజ్ -మౌనిక మ్యారేజ్ వెనకాల చాలా భావోద్వేగభరితమైన జర్నీ ఉందనేది తాజా వీడియోతో స్పష్టమవుతుంది.వీరు జర్నీని, పెళ్లిలో అద్భుతమైన మూమెంట్స్ ని పాట రూపంలో విడియోగా రిలీజ్ చేశారు .వీరి పెళ్లిపై ప్రత్యేకంగా ఓ పాటని రూపొందించారు.ఏం మనసో అంటూ సాగే ప్రేమ గీతాన్ని తాజాగా మనోజ్ విడుదల చేశారు.
ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆయన మాట్లాడుతూ .,ఈ రకమైన ప్రేమ.జీవితంలో ఒక్కసారే ఉంటుందని చెబుతుంటారు.
మౌనిక నాకోసం పుట్టిన ఒకరని నాకు తెలుసు.ప్రేమించబడాలని ఎలా అనిపిస్తుందో నాకు చూపించినందుకు ధన్యవాదాలు`అంటూ తన భార్య మౌనికారెడ్డికి ఈ సాంగ్‌ని అంకితం చేస్తున్నట్టుగా ఈ పాటని పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లికి ముందు విదేశాల్లో కలిసి ట్రావెల్ చేసిన ఫోటోలు, పెళ్లి ప్రారంభం నుంచి పెళ్లి అయిపోయేంత వరకు చోటు చేసుకున్న అత్యంత ఆనందకర, భావోద్వేగభరిత మూమెంట్లని చూపించారు.చివరికి పెళ్లిలో మనోజ్, మౌనికా రెడ్డి చేతులు పట్టుకుని చిన్నారి చేతులను చూపించారు.ఫైనల్‌గా శివుడి ఆజ్ఞ అంటూ ముగించారు.ఈ పాట ఆద్యంతం ఎమోషనల్‌గా, గుండెని హత్తుకునేలా ఉంది.ఇది మంచు మనోజ్ ఫీలింగ్‌ని తెలియజేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ పాటని అనంత శ్రీరామ్ రాయగా, అచ్చు రాజమణి కంపోజ్ చేశారు.ఆయనే ఆలపించారు.
దీనికి లార్డ్ శివ డైరెక్టర్( Lord Shiva ) అంటూ వెల్లడించడం విశేషం.ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది.
మంచు మనోజ్.ముందు ప్రణీతని వివాహం చేసుకున్నారు.
కానీ కొన్నాళ్లకే విడిపోయారు.ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మనోజ్.
మౌనికా రెడ్డి ప్రేమలో పడ్డారు.ఆమె కూడా తన మొదటి భర్తకి విడాకులిచ్చింది.
దీంతో ఈ ఇద్దరు కలిసి తిరిగారు.ఈ క్రమంలో వీరి ప్రేమకి ఇంట్లో నుంచి ఎదురైన వ్యతిరేకతపై పోరాడి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.
గత నెల 3,4తేదీలో మనోజ్, మౌనికారెడ్డి ఒక్కటయ్యారు
.







