హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ బోర్డు తిప్పేసింది.ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ఇన్సోఫీ సంస్థ మెయిల్స్ పంపింది.
కాగా ప్రస్తుతం ఇన్సోఫీ కంపెనీలో ఏడు వందల మంది ఉద్యోగులు ఉన్నారు.సుమారు 650 మంది నుంచి రూ.4 లక్షల చొప్పున… అదేవిధంగా 50 మంది నుంచి రూ.10 లక్షల చొప్పున పలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుందని తెలుస్తోంది.అంతేకాకుండా ఏడాదిన్నరగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు.ఈ క్రమంలో ఈ ఉదయం ఆకస్మాతుగా సంస్థను మూసివేస్తుండటంతో ఉద్యోగాలు తీసేసిస్తున్నట్లు మెయిల్స్ పంపింది.దీంతో ఖంగుతిన్న ఎంప్లాయిస్ సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ గురించి ఆరా తీస్తున్నారు.







