తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తమకు ఏపార్టీ అవసరం లేదని చెప్పే జగన్.డిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్రానికి విధేయత చూపుతూనే ఉన్నారు.
పోనీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చిందా అందుకే కేంద్రానికి జగన్ అంతా విధేయత చూపుతున్నారా ? అంటే అదీలేదు.ప్రత్యేక హోదా విషయంలోనూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) విషయంలోనూ, విభజన హామీలను నెరవేర్చడంలోనూ ఇలా అన్నిట్లోనూ ఏపీ పై చిన్న చూపు వహిస్తోంది కేంద్రం.
అయినప్పటికి కేంద్రంతో సక్యతగా మెలుగుతున్నారు సిఎం జగన్.మరి రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం కేంద్రంపై ఎందుకు పోరాడడం లేదని సిఎం జగన్ పై ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్నో మార్లు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తమే జగన్ డిల్లీ వెళ్ళినట్లు వైసీపీ నేతలు చెబుతున్నప్పటికి.అందులో జగన్ స్వార్థ ప్రయోజనలే తప్పా రాష్ట్ర ప్రయోజనలు లేవనేది కొందరి అభిప్రాయం.జగన్ పై ఉన్న కేసుల కారణంగానో, వివేకా హత్య కేసు బయటకు పొక్కకుండానో ఇలా సొంత ప్రయోజనల కోసమే జగన్ వెలతారని ప్రదానంగా వినిపిస్తున్న విమర్శ.అయితే ఇంతవరకు కేంద్రం కూడా ఏపీలో రాజకీయ లభ్ది కోసమే జగన్ తో సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నియకల తరువాత మొత్తం సీన్ రివర్స్ అయింది.ఊహించని విధంగా వైసీపీకి షాక్ ఇచ్చారు పట్టభద్రులు.దాంతో కేంద్రం కూడా జగన్ విషయంలో యుటర్న్ తీసుకున్నాట్లు కనిపిస్తోంది.వీలైనంత వరకు జగన్ కు దూరంగా ఉండేందుకే కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమౌతుంది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కొనే ప్రతిసారి జగన్ డిల్లీ పయనమౌతారు.

అక్కడ కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతారనేది కొందరు చెబుతున్నా మాట.అయితే ఈసారి మాత్రం జగన్ ప్రయత్నలేవీ ఫలించినట్లు కనిపించలేదు.అందుకు ఉదాహరణ ఇటీవల అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి పరిణామమే.
ఇక త్వరలోనే అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy ) కూడా అరెస్ట్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.మరి కేంద్రం ఆదేశాలు లేనిదే సిబిఐ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిందా ? కేంద్ర పెద్దలకు తెలియకుండానే భాస్కర్ రెడ్డిని( YS Bhaskar Reddy ) సిబిఐ అరెస్ట్ చేసిందా ? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.

మొత్తానికి గతంలో జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించిన కేంద్రం సక్యతతో మెలిగిందని, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తాజా పరిణామాలు చెబుతుండడంతో కేంద్రం జగన్ చేయి వదిలినట్లు కనిపిస్తోంది.మరి కేంద్రం చేయి విడిస్తే.పాత కేసులు, కొత్త సమస్యలు అన్నీ జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.మరి కేంద్రం అండ లేకుండా జగన్ ఎలా నిలబడతారో చూడాలి.







