సౌత్ స్టార్ యాక్ట్రెస్ త్రిష( Trisha ) రెండు దశాబ్ధాలుగా ఆమె నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2లలో నటించి మెప్పిస్తుంది త్రిష.
కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష తెలుగు పరిశ్రమని మాత్రం లైట్ తీసుకుంది.ఇక్కడ నుంచి ఒకటి రెండు ఛాన్స్ లు వచ్చినా సరే కాదని చెప్పేస్తుందట.
త్రిషకు స్టార్ డం తెచ్చింది తెలుగు పరిశ్రమే.కానీ అమ్మడు మాతృ భాష మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది.

ఆచార్యలో కాజల్( Kajal Aggarwal ) కన్నా ముందు త్రిషని అనుకున్నారు కానీ సినిమా మొదలు పెట్టగానే ఆమె ఎందుకో తప్పుకుంది.అఫ్కోర్స్ ఆచార్యలో కాజల్ కూడా లేపేశారు అది వేరే విషయం అనుకోండి.త్రిష మాత్రం టాలీవుడ్( Tollywood ) లో అవకాశాలు ఇస్తానన్నా సరే నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటుంది.బహుశా అమ్మడికి తెలుగులో చేయాలన్న ఆసక్తి లేదు కావొచ్చు.

కానీ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.త్రిష అందుకు సరే అంటే మాత్రం ఇక్కడ వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.ప్రస్తుతం పి.ఎస్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.త్రిష తో పాటుగా కొందరు భామలు టాలీవుడ్ అంటే మాత్రం అంత ఆసక్తి కనబరచడం లేదు.కారణాలేంటో మాత్రం తెలియలేదు.







